కార్యకర్తలతో ఘనంగా వైయస్ జగన్ 52 జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
December 21, 2024
స్థానిక నిర్మల ఉదయ్ అనాధ శరణాలయంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ 52వ జన్మదిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు...
కార్యక్రమానికి తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి డైమండ్ బాబు అనాధ శరణాలయం లోని చిన్నారులతో జగనన్న జన్మదిన వేడుకలను అనాధలైన చిన్నారులతో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు... అనంతరం కేక్ కట్ చేసి అభిమానులతో కేక్ పంచుకున్నారు...
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫిరంగిపురం జడ్పిటిసి దాసరి కత్తి రేణమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని
అనాధ శరణాలయంలో నిరాశ్రయులైన చిన్నారులతో కలిసి ఆహారాన్ని అందించటం ఆనందంగా ఉంది అన్నారు
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 52 జన్మదిన వేడుకలను కార్యకర్తలతో కలసి జగనన్న అభిమానుల ఆనందాన్ని పంచుకోవడంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు
ఆమె వెంట వైఎస్ఆర్సిపి మాజీ మండల పార్టీ అధ్యక్షుడు మార్పుల శివరామరెడ్డి పాల్గొని జన్మదిన వేడుకలను ఉద్దేశించి ప్రత్యేకమైన సందేశాన్ని కార్యకర్తలతో పంచుకున్నారు.
కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి సర్పంచులు ఉప సర్పంచులు వైసిపి అభిమానులు పాల్గొన్నారు