నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సిఐ బి రవీంద్రబాబు

సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తమై ఉండాలి నేరాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన సిఐ బి రవీంద్రబాబు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు అన్నారు.. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదిశలతో మండల పరిధిలోని వేములూరిపాడు లోని ఎంపీపీ ఎస్ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వారధి కార్యక్రమాన్ని నిర్వహించారు... కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఫిరంగిపురం సిఐ రవీంద్రబాబు మాట్లాడుతూ సైబర్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు.. సమాజంలో జరుగుతున్న నేరాలపై అప్రమత్తమై ఉండాలని మరి ముఖ్యంగా మహిళలు జరుగుతున్న నేరాలపై అప్రమత్తమై అవగాహన కలిగి ఉండాలని గ్రామస్తులకు సూచించారు.. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు ఫిరంగిపురం పోలీసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...