బెంజ్ న్యూస్.10- 7 -2024న క్రోసూరు మండలం బయ్యారం హైస్కూల్లో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కిషోర్ బాల బాలికలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్ అధ్యక్షత వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ గా గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది నూతక్కి దిలీప్ కుమార్ మాట్లాడుతూ కిశోర బాలబాలికలు ఈ తరంలో అందరూ ఫోన్ కి బానిస అవుతున్నారు ఇంటర్నెట్ లేనిది రోజు కూడా గడపని పరిస్థితుల్లో ఉన్నాము మన అనుదిన పనుల్లో ఇంటర్నెట్ ఒక భాగం అయిపోయింది కాబట్టి ఇంటర్నెట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి ఫోన్ రీఛార్జ్ షాపుల్లో రీఛార్జ్ చేయించుకునేటప్పుడు మన ఫోన్ నెంబర్ అక్కడ ఎవరికి ఇవ్వకుండా రీఛార్జ్ అయ్యే వరకు ఉండి రీఛార్జ్ చేయించుకుని వెళ్లాలి ఫోన్ రిపేర్ షాపుల్లో కూడా మన ఫోన్ పాస్వర్డ్ ఎవరితోనూ పంచుకోకూడదు అలాగే సోషల్ ఫేస్బుక్ మీడియాలో జాగ్రత్తగా ఉండాలి.
ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ స్నాప్ చాట్ ఇలాంటి వాడేటప్పుడు మన వ్యక్తిగత వివరాలు అందులో పంచుకోకూడదు ఈ వివరాలు సైబర్ నేరగాళ్లు గమనించి వాటిని ఉపయోగించి తిరిగి మనల్ని బెదిరించడం చేస్తారు మన ఫొటోస్ ను వేరే వాళ్ళకి అమర్చి తిరిగి మనల్ని బెదిరిస్తారు అలాగే మన ఏటీఎం కార్డు పోయినప్పుడు సంబంధిత బ్యాంకు కి గాని ఏటీఎం సెంటర్ గాని వెళ్లి వాళ్లు చెప్పిన విధంగా బ్లాక్ చేసుకోవాలి. అంతేకానీ ఇతరులకి ఓటిపి చెప్పకూడదు ఫోన్లో యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు అన్ని వివరాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఫోన్ లో వస్తున్న పాప్ అప్ మెసేజ్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే జన సంచారం ఎక్కువగా ఉన్నచోట్లలో వైఫై కనెక్షన్ చేసుకుంటే మన ఫోన్లో ఉన్న సమాచారం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంటర్నెట్ అవసరం ఉన్నంతవరకే ఉపయోగించుకోవాలి ఈ సైబర్ నేరల్లో పడకుండా ఉండాలి అంటే మన ఫోన్ పాస్వర్డ్ ఎవరికి తెలియకుండా ఉండేలా చూసుకోవాలి పర్సనల్ ఫొటోస్ కానీ డేటా కానీ సోషల్ మీడియాలో పెట్టకుండా ఉండాలి. సైబర్ నేరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ సుపీరియర్ సిస్టర్ విన్నరాసి మాట్లాడుతూ ఇంటర్నెట్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఈ చదువుకో వయసులో ఫోన్లోకి ఎక్కువ దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండాలి ఫోన్ ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే వాడుకొని దానిని పక్కన పెట్టాలి అని తెలియజేశారు , ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మారుతి మాస్టారు శ్రీనివాసరావు మాస్టారు మరియు గుడ్ షెఫర్డ్ సిబ్బంది పవన్ బాలబాలికలు పాల్గొన్నారు.