సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తనపల్లి పట్టణంలో స్థానిక ఏరియా గవర్నమెంట్ హాస్పటల్ సూపర్డెంట్ లక్ష్మణరావు, మరియు ప్రముఖ కార్డియాలజిస్ట్ చల్లా నాగరాజారెడ్డి, డాక్టర్ జ్యోతి నాగరాజా రెడ్డి, డెంటల్ డాక్టర్ పోసాని ప్రసన్నకుమార్ నీ ఆర్యవైశ్య సంఘం మరియు యువజన సంఘంఆధ్వర్యం లో ఘనంగా సత్కరించారు.ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్త రామకృష్ణ మాట్లాడుతూ సొసైటీలో డాక్టర్లు కీలకపాత్ర వహిస్తున్నారని, కనపడే ప్రత్యక్ష దైవం డాక్టర్ అని కొనియాడారు డాక్టర్స్ డే పురస్కరించుకొని డాక్టర్లందర్నీ సత్కరించు కోవటం కూడా ఎంతో గర్వకారణం అని తెలియజేశారు.ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లప్పుడూ సమాజంలో ఉన్నదైన పాత్ర పోషిస్తూ ఎంతో మంది జీవితాలను వెలుగు నింపేది డాక్టర్లు అని కొనియాడారు.ప్రముఖ అడ్వకేట్ దివ్వెల శ్రీనివాసరావు మాట్లాడుతూ కరోనా టైంలో తన ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా వైద్యం అందించారని వారందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవాధ్యక్షులు కొత్త రామకృష్ణ, ప్రముఖ అడ్వకేట్ దివ్వెల శ్రీనివాసరావు , చిలకల వాసు, స్వామి ప్రసాద్, కొల్లిపర కుమార్, దివ్య శివ భాస్కర్, హరికుమార్, తిరుముల మొదలగువారు పాల్గొన్నారు.