బాల బాలిక లు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి ఈరోజు మునుగోడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో గుడ్ షెఫర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది.

 


    బెంజ్ న్యూస్.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కే వెంకటేశ్వర్లు ప్రధానోపాధ్యాయులు  విచ్చేసినారు ఈ కార్యక్రమానికి బత్తుల బాబు  అధ్యక్షత వహించడం జరిగింది ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సెల్ ఫోన్ ను మంచికి మాత్రమే ఉపయోగించాలి చెడుకు ఉపయోగించకూడదన్నారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్ గా బచ్వన్ బచావో ఆందోళన్ స్టేట్ కోఆర్డినేటర్ తిరుపతి రావు విచ్చేసి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఫోన్ కు బానిసలు అవుతున్నారు ఇంటర్నెట్ అధికంగా ఉపయోగించి  ఇబ్బందులకు గురి అవుతున్నారు ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న బాల బాలికలు వారికి తెలియకుండానే వాట్సాప్ ట్విట్టర్ ఫేస్బుక్ ఇంస్టాగ్రామ్ షేర్ చాట్ ఇలాంటి అనేకమైన యాప్లను డౌన్లోడ్ చేసుకొని వాటికి బానిసలై విద్యకు దూరంగా ఉంటున్నారు
 ముఖ్యంగా ఫోన్ రిపేర్ వచ్చినప్పుడు గానీ మొబైల్ రీఛార్జ్ చేసేటప్పుడు గాని ఎవరు వారి యొక్క వ్యక్తిగత పాస్వర్డ్ ఇతరులకు తెలియపరచడం మంచిది కాదన్నారు అదేవిధంగా ఎవరైనా మీకు గిఫ్ట్ వచ్చినయ్ లేకపోతే మీకు లక్ష రూపాయలు లోన్ వస్తుంది అని మనం నమ్మించి ఓటిపి చెప్పమని అడుగుతారు ఎవరు కూడా వారికి ఓటిపిని ఎవరికి చెప్పకూడదు అన్నారు గుడ్ షెఫర్డ్ కాన్వెంట్ డైరెక్టర్ సిస్టర్ విన్నారాశి  మాట్లాడుతూ సైబర్ నేరాలకు ఉచిత టోల్ ఫ్రీ నెంబర్ 1930 ని అందరు గుర్తుపెట్టుకోవాలి అన్నారు ముఖ్యంగా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి చదువుకు దగ్గరగా ఉండే ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి పక్కన పెట్టాలన్నారు  ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు గుడ్ షెఫర్డ్ సిబ్బంది పాల్గొన్నారు