తమ్మిలేరు నుండి దిగువకు నీరు విడుదల.


 చింతలపూడి.బెంజ్ న్యూస్.


 ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నుండి  200 క్యూసెక్కులు నీరు విడుదల చేసినట్లు తమ్మిలే రిజర్వాయర్ అసిస్టెంట్ ఇంజనీర్ పరమానందం తెలిపారు. తమ్మిలేరు  రిజర్వాయర్ ప్రాజెక్టులో నీరు పుష్కలంగా వచ్చినందున  ఇన్ఫ్లో ఇంకా కొనసాగుతున్నందున దిగువకు నీరు విడుదల చేసినట్లు చెప్పారు.  ఉన్నత అధికారుల ఆదేశాల మేరకే నీటిని విడుదల చేశామని  ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని  ఆయన తెలిపారు.