బెంజ్ న్యూస్ .మెరకముడిదాం లో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను ) ఫెంక్షన్ మరియు రైతులకు విత్తనాలు అందజేయడంలో ఏటువంటి లోటుపాట్లు ఉండకూడదని అధికారులకు సూచించారు. రైతులకు ఇచ్చే విత్తనాలు, ఎరువులు నాణ్యత లో లోపాలు ఉండకూడదు మరియు రైతులకు ఎప్పటికి అప్పుడు వ్యవసాయ సిబ్బంది అందుబాటులో ఉండాలి అని అన్నారు. భారత దేశములో రైతాంగం లేని రాష్ట్రం, జిల్లా,మండలు మరియు గ్రామాలు లేనే లేవు. సుమారు మన భూమి పుట్టుక నుంచి మనుషులు వ్యవసాయము పై నే ఆధారపడి జీవిస్తున్నారు. ఎందుకంటే రైతుకు భూమి ఇస్తే వ్యవసాయం మాత్రమే చేయగలడు. మనం వ్యవసాయదారులకు అనుక్షణం చేదోడు వాదోడుగా ఉండాలి రైతుకు ప్రతి ఒక్కరు విలువు ఇవ్వాలి.రానున్న తరం వారికి వ్యవసాయం మీదన అవగాహన కల్పించాలి.ఈ కార్యక్రమంలో ఎక్స్ డి సి ఎం ఎస్ చైర్మన్ పెదబాబు , ఎంపీపీ ప్రతినిధి తాటి వేణు , ఎక్స్ జడ్పిటిసి కోట్ల వెంకట్రావు ఎంపీటీసీలు ,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.