బెంజ్ న్యూస్.పల్నాడు జిల్లా పెదకూరపాడు మండల పరిధి 75త్యాళ్ళూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఎన్.సి.సి జె.డబ్ల్యు అండ్ జేడీ ఎంపికలు మంగళవారం పాఠశాల ఆవరణలో గుంటూరు 25(ఎ) బి.ఎన్ ఎన్.సి.సి యూనిట్ వారు చేపట్టారు.దీనిలో 60 మంది విద్యార్థులు పాల్గొనగా 31 మంది ఎంపికైనట్లు స్కూల్ ఎన్.సి.సి ఆఫీసర్ షేక్ నాగులు మీరా తెలిపారు.ఈ ఎంపిక కార్యక్రమంలో హవల్దార్ లు
బి.శ్రీనివాసుల్, చి.హెచ్ చిరంజీవి, నాయక్ సుబేదార్ జితేందర్ సింగ్ లు పాల్గొన్నారు.దేశంలోని యువతను క్రమశిక్షణ,దేశభక్తి గల పౌరులుగా అభివృద్ధి చేయడంలో ఎన్.సి.సి ప్రముఖ పాత్ర పోషిస్తుందని, ఇది పూర్తి చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయులు డాక్టర్ ఎ.శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా అన్నారు.పీసి చైర్మన్ గుత్తికొండ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు వీరికి సహకారం అందించారు.