సత్తెనపల్లి ముగ్గురు మున్సిపల్ కార్మికుల ఉద్యోగ విరమణ


 సత్తెనపల్లి : బెంజ్ న్యూస్

సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయంలో బోర్ టెక్నీషియన్స్ గా పని చేస్తున్న గర్నెపూడి రమేష్, మక్కెన నరసింహులు, పబ్లిక్ హెల్త్ వర్కర్ చింతగుంట్లవెంకటేశ్వర్లు  ఉద్యోగ విరమణ చేశారు. ఉద్యోగ విరమణ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ డి.ఈ మధుసూదన్, శానిటరీ ఇన్స్పెక్టర్ విజయ సారధి, టిపిఎస్ రాఘవరావు ఘనంగా సన్మానించి పిఎఫ్ చెక్కులను ఉద్యోగ విరమణ చేసిన ముగ్గురికి అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో బార్  అసోసియేషన్ మాజీ అధ్యక్షులు గుజ్జర్లపూడి మార్కురావు, న్యాయవాది బంకా కిషోర్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గుజ్జర్లపూడి రవిరాజు, గర్నపూడి రమేష్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.