సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణంలో నాలుగు కోర్టుల పరిధిలో జూన్ 29న న్యాయ అవగాహన సదస్సు, జాతీయ లోక్ అదాలత్ జరిగింది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నందు సీనియర్ సివిల్ జడ్జి,మండల న్యాయ సేవ సాధికార సంస్థ ఛైర్మన్ వెంకట నాగ శ్రీనివాసరావు ఉచిత న్యాయ సేవల చట్టాలను గురించి, లోక్ అదాలత్ యొక్క ప్రాముఖ్యత గురుంచి విశదీకరించారు.జాతీయ లోక్ అదాలత్ నందు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి జూనియర్ డివిజన్ కోర్టు 15 కేసులు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ డివిజన్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో 63 కేసులు, రెండవ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టు పరిధిలో 39 కేసులు, మండల లీగల్ సర్వీస్ అధారిటీ పరిధిలో 5 కేసులు, సత్తెనపల్లి పరిధిలోని నాలుగు కోర్టులలో మొత్తం 122 కేసులు జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించబడినవి. పరిష్కారం క్రింద మొత్తం 73,72,706 లు కక్షిదారులకు ఇప్పించడమైనది. ఈ కార్యక్రమమును విజయవంతం చేసిన న్యాయ మూర్తులు, న్యాయవాదులకు, పోలీసులు కక్షిదారులకు, బి.ఎస్.ఎన్.ల్ అధికారులకు సీనియర్ సివిల్ జడ్జి వెంకట నాగ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలియజేశారు.