మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

 


బెంజ్ న్యూస్  : అమరావతి 

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన, సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.