కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని కైవసం చేసుకున్న వైసీపీ
March 27, 2025
కడప జడ్పీ ఛైర్మన్ గా రామగోవిందరెడ్డి
ఎన్నికలో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ
ఒకే నామినేషన్ రావడంతో గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటన
కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవిని వైసీపీ కైవసం చేసుకుంది. జిల్లాపరిషత్ ఛైర్మన్ గా వైసీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో పోటీకి టీడీపీ దూరంగా ఉంది. ఛైర్మన్ పదవికి కేవలం వైసీపీ నుంచి మాత్రమే నామినేషన్ రావడంతో రామగోవిందరెడ్డి గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.
జడ్పీ ఛైర్మన్ గా ఎన్నికైన రామగోవిందరెడ్డి బ్రహ్మంగారిమఠం మండలం జడ్పీటీసీగా రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ అధినేత జగన్... రామగోవిందరెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.