పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కి నిరసనగా సత్తెనపల్లి

నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన బెంజ్ న్యూస్ : పల్నాడు బ్యూరో సత్తెనపల్లి పట్టణంలో తాలూకా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా సత్తెనపల్లి నియోజకవర్గ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ మరియు బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టి చర్చ్ సంఘ పెద్దలతో శాంతియుత కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ ఫౌండర్ పాస్టర్ సుధీర్, ప్రెసిడెంట్ డేవిడ్ రాజు, ఫెలోషిప్ పాస్టర్లు, పాస్టర్ పారుపల్లి జోసెఫ్ బాగ్స్ మెమోరియల్ సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ప్రెసిడెంట్ గుజ్జర్లపూడి స్కైలాబ్, వైస్ ప్రెసిడెంట్ గుజ్జర్లపూడి చంద్రకాంత్, జాయింట్ సెక్రటర్ బంకా కిషోర్, పెద్దలు పెద్దింటి నాగేశ్వర రావు, బి.యం.సి.బి చర్చ్ యూత్ తది తరులు పాల్గొన్నారు.