గ్రామ ప్రజా వేదికలో రెవిన్యూ సదస్సు
January 02, 2025
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం
మండల పరిధిలోని హౌస్ గణేష్ గ్రామంలో బుధవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు...
రాష్ట్ర ప్రభుత్వం రైతుల అవసరాల నిమిత్తమై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుకు రైతులు గ్రామస్తులు హాజరయ్యారు
రైతుల నుండి పట్టాదార్ పాస్ పుస్తకముల కొరకు 5 అర్జీలు, భూమి కొలతల కొరకు 3 అర్జీలను ఫిరంగిపురం తాసిల్దార్ జె ప్రసాద్ రావు రైతుల నుండి మొత్తం ఎనిమిది అర్జీలను స్వీకరించారు
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుంటూరు ఆర్డీవో కె శ్రీనివాసరావు, అధ్యక్షతన గ్రామసభకు జిల్లా సర్వే డివిఎస్ఎన్ కిషోర్, ఫిరంగిపురం జాయింట్ సబ్ రిజిస్టర్ సిహెచ్ బీమా భాయ్, గ్రామ రెవెన్యూ అధికారులు, సుభాని, సిహెచ్, శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు రైతులు, సమావేశంలో పాల్గొన్నారు....