స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్

అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ, బ్యాంకింగ్ సూచీలు 423 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ 108 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ గత మూడు రోజులుగా లాభాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల బాట పట్టాయి. బ్యాంకింగ్, ఐటీ సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరగడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 423 పాయింట్ల నష్టంతో 76,619కి పడిపోయింది. నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 23,203 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: జొమాటో (2.79%), రిలయన్స్ (2.57%), నెస్లే ఇండియా (2.26%), టాటా స్టీల్ (1.96%), ఏసియన్ పెయింట్ (1.95%). టాప్ లూజర్స్: ఇన్ఫోసిస్ (-5.77%), యాక్సిస్ బ్యాంక్ (-4.71%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.58%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.11%), టీసీఎస్ (-1.96%).