తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులకు కొత్త జడ్జిలు.. తెలంగాణకి నలుగురు, ఏపీకి ఇద్దరు
January 15, 2025
తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. జస్టిస్ రేణుక, జస్టిస్ నందికొండ నర్సింగ్ రావు, జస్టిస్ తిరుమల దేవి, జస్టిస్ మధుసూదన్ రావు పేర్లను ప్రతిపాదించింది. కాగా నిన్న హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులైన విషయం తెలిసిందే. అటు ఏపీ హైకోర్టుకు అవధానం హరిహరనాథ శర్మ, యడవల్లి లక్ష్మణరావు పేర్లను కొలీజియం రిఫర్ చేసింది.