నిబంధనలు పాటించని పడవలపై చర్యలు తీసుకోవాలని

నదిపై ప్రయాణించే పడవలు ప్రభుత్వం పొందుపరిచిన నియమ నిబంధనల ప్రకారం నడవాలని నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కన్వీనర్ రాంబాబు అన్నారు. మంగళవారం ఉదయం అచ్చంపేట ఎంపీడీవో శ్రీనివాసరావుని కలిసి వినతి పత్రం అందించారు. అధిక ధరలు డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై ఆరోపించారు. తగు చర్యలు నిమిత్తం టెండర్లదారులను పిలిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ రాజు శ్రీనివాసరావు సుధాకర్ పాల్గొన్నారు.