పేర్ని నాని ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
December 21, 2024
మధ్యాహ్నం 2 గంటల్లోగా స్టేషన్‌కు రావాలని ఆదేశాలు
నిజానిజాలు చెప్పాలని కోరిన పోలీసులు
అందుబాటులో ఉన్న రికార్డులు అందజేయాలంటూ నోటీసులు
రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు
మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని, ఆయన కొడుకు పేర్ని కిట్టు నిందితులుగా ఉన్న రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. ఇవాళ (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల లోగా స్టేషన్‌కు రావాలంటూ కోరారు. ఈ మేరకు ఆదివారం ఉదయం నోటీసులు జారీ చేశారు. ఆదేశాలను అందించేందుకు ఇంటికి వెళ్లగా... ఎవరూ లేకపోవడంతో పోలీసులు తలుపులకు అంటించారు.
నిజానిజాలను చెప్పాలని నోటీసుల్లో పోలీసులు కోరారు. అందుబాటులో ఉన్న రికార్డులను అందివ్వాలని పేర్కొన్నారు. కాగా ఈ కేసులో పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా ఉన్నారు. కేసులో ఏ2గా ఉన్న మానస తేజ పరారీలో ఉండగా గాలింపు చర్యలను పోలీసులు పెంచారు. కాగా, రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టేందుకు దర్యాప్తులో వేగం పెంచారు.