అమరావతి, సచివాలయం 27-12-24

అమరావతి, సచివాలయం 27-12-24 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధికి సహకరించండి ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి వినతి పత్రమును ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న ను కలిసి అందజేసిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు **** శ్రీ తిమ్మమ్మ మర్రిమాను వద్ద చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు గురించి ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న తో ఈరోజు వెలగపూడి లోని సచివాలయంలో ఆయన చాంబర్లో చర్చించిన అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈ క్రింద విషయాలను ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రద్యుమ్న దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది 1) స్వాగత ముఖద్వారాలు (Arches) a) మదనపల్లి - కదిరి హైవే మార్గమధ్యలో - కొక్కంటి క్రాస్ వద్ద ఒకటి. b) కదిరి - రాయచోటి రోడ్డు మార్గమధ్యలో - రెక్కమాను వద్ద ఒకటి c)తిమ్మమ్మ మర్రిమాను హై స్కూల్ క్రాస్ వద్ద ఒకటి 2) డబుల్ రోడ్డు - కదిరి నుండి కొక్కంఠి క్రాస్ రోడ్ వరకు 3)విశ్రాంతి గదులు మరియు పబ్లిక్ టాయిలెట్స్. 4) ఓబులేసు గుట్ట మీదున్న TTD., వారిచే నిర్మించబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయమునకు విగ్రహం ఏర్పాటుతో పాటు అసంపూర్తిగా ఉన్న రోడ్డు మరియు నీటి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి 5)బస్ షెల్టర్ మరియు షాపింగ్ complex నిర్మాణం. 6)గొల్లవాని కుంటకు మరమ్మతులు మరియు బోటింగ్ సౌకర్యం. 7)తిమ్మమ్మ మర్రిమాను నుండి పెదబల్లికి రోడ్డు (అటవీ ప్రాంతం) నిర్మించుట వలన 10 కిలోమీటర్ల దూరం తగ్గుదల. 8)తిమ్మమాంబ కు చెందిన భూమిలో కళ్యాణ మండపము, కమ్యూనిటీ హాలు , వసతి గదులు మొదలుగునవి. 9)తిమ్మమ్మ గారు నివసించిన గంగరాజు ల కోటవద్ద వసతి గృహాలు, టాయిలెట్స్ 10) గంగరాజు ల కోట చుట్టూ 20 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణము. 11) తిమ్మమ్మ మర్రిమాను అభివృద్ధి కి గ్రామస్థుల నుండి అటవీ శాఖ సేకరించిన 26.48 ఎకరముల భూమిలో యాత్రికుల సౌకర్యార్థం కల్పించవలసిన పనుల కోసం కనీసం 5 ఏకరముల భూమిని కేటాయించాలి. బస్టాండ్, షాప్ రూములు,గుడికి వెళ్ళడానికి దారి మార్గం, తిమ్మమ్మ తల్లి రథం ఊరేగింపు తదితర అవసరాల కోసం. 12)ఈశ్వరమల కొండపైకి మెట్ల దారి నిర్మాణం. 13) ఈశ్వరమాల కొండ 500 మీటర్ల ఎత్తులో తిమ్మమ్మ మర్రిమాను చూసే విధంగా view point నిర్మాణం. మరియు view point చేరుకోవడానికి రోడ్డు నిర్మాణం. 14) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయమునకు రోడ్డు. 15) సువిశాలమైన అమూస్మెంట్ పార్క్, ఆట స్థలం తదితర పనులు. 16) ఒక ఆధ్యాత్మిక కేంద్రము. 17)ఈశ్వరామల కొండ మొత్తము పచ్చగా, పొడవుగా పెరిగే ఎత్తైన చెట్లను పెంపకము. 18)తిమ్మమ్మ మర్రిమాను నుండి గాజులవారిపల్లికి కదిరి - రాయచోటి మైన్ రోడ్డుకు లింక్ రోడ్డు, సామాలగొంది మీదుగా.