డిసెంబర్ 2 నుంచి కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్
December 02, 2024
డిసెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మపాటి శ్రీధర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు అందిస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వస్తాయో రావో అన్నట్లుగా పింఛన్ల పరిస్థితి ఉండేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీన ఇంటికే పింఛన్లు అందిస్తుమన్నారు. ఒకటో తేదీ సెలవు అయితే 30వ తేదీనే పింఛన్లు అందిస్తున్నామని, ఇలా నెలకు రూ.4 వేలు ఒకటో తేదీనే ఇంటికే పింఛన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని పేర్కొన్నారు. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి ఇస్తారు డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబుకు కుడిభుజంగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో అభినందనీయమన్నారు. అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నామని, నూతన సంవత్సరంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు కూడా ఇవ్వబోతున్నామన్నారు