సిపిఐ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

 


      బెంజ్ న్యూస్.అమరావతికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన 15 వేల కోట్లల రూపాయలు గ్రాంట్ గా మార్చాలి  


సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య 


మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి : సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య


2024 డిసెంబర్ 26 నుంచి 2025 డిసెంబర్ 26 వరకు  ఒక సంవత్సరం పాటు భారత కమ్యూనిస్టు పార్టీ నూరు సంవత్సరాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ జాతీయ సమితి పిలుపునిచ్చిందని ఈ నేపద్యంలో ఒక సంవత్సరం పాటు పార్టీ విప్లవ ఉద్యమ చరిత్రను వాడ వాడల పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సిపిఐ మంగళగిరి  నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య పిలుపునిచ్చారు.

ఆదివారం తాడేపల్లి సిపిఐ పార్టీ కార్యాలయంలో (నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో) తాడేపల్లి ప్రాంత సిపిఐ కార్యకర్తల ముఖ్య సమావేశం సిపిఐ తాడేపల్లి పట్టణ సహాయ కార్యదర్శి తుడిమెల్ల వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ పేదవాడి భవిష్యత్తు కమ్యూనిస్టు పార్టీ చేతుల్లో ఉందని ఏ ప్రజా సమస్య అయినా  సిపిఐ ముందుండి పోరాడుతుందని

అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.15వేల కోట్లను గ్రాంట్‌గా మార్చాలని పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తిగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.సిపిఐ మంగళగిరి నియోజకవర్గం

సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ నెలకి సిపిఐ పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొనుందని 

అన్నారు.తాడేపల్లిలో అనేక ప్రజా సమస్యలపై సిపిఐ పోరాటం చేస్తుందని అన్నారు.ఫారెస్ట్ ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాంతాలలో పేద ప్రజలు ఇళ్ళు వేసుకుని నివసిస్తూ ఉన్నారని  వారు ఎప్పటికప్పుడు భయభ్రాంతులకు గురవుతున్నారని ప్రభుత్వ అధికారులు వివిధ సందర్భాలలో వారికి నోటీసులు ఇచ్చారని ప్రస్తుతం శాసనసభ్యులుగా గెలిచిన మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ హామీలు ఇచ్చి ఉన్నారని ఫారెస్ట్ భూములుకి పట్టాలి ఇస్తామని ఇరిగేషన్ భూములకి పట్టాలిస్తామని రైల్వే భూములకు పట్టాలిస్తామని  ఇంకా అనేక వాగ్దానాలు చేసి ఉన్నారని అవన్నీ అమలు చేయాలని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, తాడేపల్లి సిపిఐ నాయకులు మానికొండ డాంగే,మునగాల రామారావు,దొంత కోటేశ్వరరావు,

కర్రి సురేష్,శీలం శ్యామ్ ప్రసాద్,

ఎన్.లక్ష్మణ, సిహెచ్ క్రాంతి,సిహెచ్ బోసు బాబు,శీలం అనిల్ కుమార్,లంకే ప్రశాంత్ రాజు, లంకే ప్రసన్న,తదితరులు పాల్గొన్నారు.