గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరల్లో మార్పు ఏంతంటే..

 


దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,120గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,950గా ఉంది. మరోవైపు వెండి రేట్లు కూడా కిలోకు 1750 రూపాయలకు పైగా తగ్గి ఢిల్లీలో రూ.91,500కు చేరుకున్నాయి.ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4 వేల రూపాయలు తగ్గడం విశేషం. వెండి రేటు గత ఆదివారం జులై 14న కేజీకి రూ.95,500గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల పుత్తడి ధర ఇదే సమయంలో 10 గ్రాములకు రూ.67,600గా ఉంది. గోల్డ్ రేటు గత వారం రోజుల్లో 20 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.


పలు ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)


చెన్నైలో రూ. 74,570, రూ. 68,350


ఢిల్లీలో రూ. 74,120, రూ. 67,950


హైదరాబాద్‌లో రూ. 73,970, రూ. 67,800


విజయవాడలో రూ. 73,970, రూ. 67,800


ముంబైలో రూ. 73,970, రూ. 67,800


బెంగళూరులో రూ. 73,970, రూ. 67,800


వడోదరలో రూ. 74,020, రూ. 67,850


కోల్‌కతాలో రూ. 73,970, రూ. 67,800


కేరళలో రూ. 73,970, రూ. 67,800


కీలక నగరాల్లో కేజీకి వెండి ధరలు


ఢిల్లీలో రూ. 91,500


హైదరాబాద్‌లో రూ. 96,000


విజయవాడలో రూ. 96,000


ముంబైలో రూ. 91,500


చెన్నైలో రూ. 96,000


కోల్‌కతాలో రూ. 91,500


బెంగళూరులో రూ. 91,650


వడోదరలో రూ. 91,500


కేరళలో రూ. 96,000.. కేపీ