రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఐదు రోజులు జరిగే ఈ సమావేశాల్లో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
రేపు ఉ. 10 గంటలకు గవర్నర్ శాసనసభ, మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
శాంతిభద్రతలు, మద్యం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేయనుంది.