ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక ఆదేశాలు అమరావతి :
January 26, 2025
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయిస్తూ, సచివాలయాలను 3 కేటగిరీలుగా విభజించింది. ఇకపై A కేటగిరీ సచివాలయాల్లో ఆరుగురు, B కేటగిరీలో 7, C- కేటగిరీ సచివాలయాల్లో 8 మంది సిబ్బంది ఉండనున్నారు. కాగా పలు సచివాలయాల్లో ఎక్కువమంది, మరికొన్నిచోట్ల తక్కువ మంది ఉద్యోగులు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.