బిల్లు లేకుండా వచ్చే లారీలను పట్టుకునేది వాళ్లే.. తెల్లారితే అన్ని ఉన్నాయని వదిలేసేది వారే

రాత్రులు పట్టుకుంటారు తెల్లారితే వదిలేస్తారు.. సెటిల్మెంట్ కాని చోటల్లా పట్టుకోవడం తెల్లారి మామ అనిపిస్తే వదిలేయటం పోలీస్ పనితీరు.. బిల్లు లేకుండా వచ్చే లారీలను పట్టుకునేది వాళ్లే.. తెల్లారితే అన్ని ఉన్నాయని వదిలేసేది వారే పెదకూరపాడ
ు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ తీసుకువచ్చి
ఎవర్ని ఉద్ధరిస్తుందో అర్థం కావట్లేదు గాని దళారీ వ్యవస్థను, పోలీసు వ్యవస్థను బ్రతికిస్తుందని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఇసుక తరలించే లారీ యాజమాన్యాలతో రాజి కుదరన్నప్పుడల్లా ఇసుక లారీలు ఆపి స్టేషన్ తరలిస్తారని రాజీ కుదరక వాళ్లే అన్ని ఉన్నాయని వదిలేస్తారని ఇలాంటి అధికారుల తీరుపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. శుక్రవారం రాత్రి డి.ఎస్.పి స్పెషల్ టీం పెదకూరపాడు పోలీసులు సమన్వయంతో ఓవర్ లోడ్ తో ఎలాంటి బిల్లులు లేకుండా అమరావతి మండలం దుడుగు డంపింగ్ యార్డ్ నుండి ఇసుక లోడైన లారీలు వస్తున్నాయి అనే సమాచారంతో గారపాడు హుస్సేన్ నగరం మధ్య వాహనాలు తనిఖీచేపట్టి ఆ సమయంలో ఎలాంటి బిల్లులు లేకపోవడంతో పెదకూరపాడు పోలీస్ స్టేషన్ కు ఇసుక లోడుతో ఉన్న వాహనాలను తరలించారు. ప్రభుత్వ పనుల నిమిత్తం ఇసుక తరలిస్తే ముందస్తుగా సంబంధిత ఏఈలు అవసరమైన ఇసుకటనేది వివరాలు తెలియపరుస్తూ టోకెన్లు ఇస్తారు. ప్రభుత్వ పనులు నిమిత్తం అంటూ చీకటి వ్యాపారులు దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందానా, రోజుకు వందల సంఖ్యలో కృష్ణానది పరివాహక ప్రాంతం నుండి కోగంటి వారి పాలెం, కోనూరు, మాదిపాడు, మల్లాది, దిడుగు గ్రామాల నుండి వందల సంఖ్యలో ఎలాంటి బిల్లులు లేకుండా ఇసుక లారీలు తరలి వెళ్తున్నాయని స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు ముడుపులు అందని రోజు ఆపి భయపెట్టి, వారు మామూలు వారికి అందాక, అన్నీ ఉన్నాయి వెళ్ళచ్చు వారే సాగనంపుతున్నారని ప్రజలు తెలిపారు. ఇలాంటి అధికారుల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఉచిత ఇసుక పాలసీ కి తీరని మచ్చ వస్తుందని పార్టీ అభిమానులు నిపుణులు స్థానిక ప్రజల తెలుపుతున్నారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి ఇసుకరీచుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఏమయ్యాయి అవి పని చేస్తున్నాయా లేదా పనిచేస్తే డంపింగ్ యార్డ్ నుంచి రావాల్సిన ఇసుక డైరెక్టర్ నదిలో నుంచి ఎలా బయటకు వెళ్తుంది అనే విషయాన్ని మైనింగ్ అధికారులు జిల్లా కలెక్టర్ పర్యవేక్షించాలని ప్రజల కోరుతున్నారు