క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేత


         బెంజ్ న్యూస్.క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుతాయి 

 

 ఎమ్మెల్యే జూలకంటి


మాచర్ల : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. బుధవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాచర్ల పట్టణంలో నిర్వహించిన స్వర్గీయ జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి సయ్యద్ అన్వర్ భాష ఆధ్వర్యంలో టోర్నమెంట్ నిర్వహించారు. మొదటి బహుమతి పల్నాడు ఓవర్సీస్ జట్టు రూ.1,33,318 నగదు బహుమతి గెలుచుకోగా రెండవ బహుమతి ఎస్ ఆర్ తండా జట్టు రూ.93,318లు, మూడవ బహుమతి పెద్దారెడ్డి జట్టు రూ.63,318లు, నాలుగవ బహుమతి నరేంద్ర 11 జట్టు రూ.33,318లు గెలుచుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ రాజు కు రూ.10 వేల నగదు తో పాటు బెస్ట్ బ్యాట్స్ మెన్  క్రింద ఇంగ్లీష్ విల్లో బ్యాటు అందజేశారు. బెస్ట్ బౌలర్ గా ఎన్నికైన కోటికి అడిడాస్ షూస్ అందజేశారు. విజేతలందరిని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జూలకంటి అక్కిరెడ్డి సయ్యద్ అన్వర్ భాష జూలకంటి చిరంజీవి రెడ్డి పులుసు ప్రతాపరెడ్డి పంగులూరి పుల్లయ్య రామ టాకీస్ జానీ గోరంట్ల ధీరజ్ దొండపాటి శివనాగు గోరంట్ల శ్రీ వాత్సవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు.