క్రీస్తు మార్గం అనుసరణీయం

తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్న క్రీస్తు జయంతి వేడుకలో తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.... పార్టీ కార్యకర్తలతో కలసి జరుపుకునే సెమీ క్రిస్మస్ వేడుకల్లో చిన్నారుల పాటలతో కోలాహలం సంతరించుకుంది కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.... ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొనే క్రిస్మస్ వేడుకలలో పాలుపంచు కోవటం శుభపరిణామంగా భావించాలన్నారు.... క్రిస్మస్ తాత వేషధారణలో ఓ చిన్నారి చాక్లెట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలుతున్న దృశ్యం ఆకర్షణగా నిలిచింది... చిన్నారుల నృత్య ప్రదర్శన విశేషముగా చూపర్లను ఆకట్టుకుంది... కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ఈవేధిక కుల మతాలకు అతీతంగా సెమీ క్రిస్మస్ పండుగకు సూచన అన్నారు.. క్రీస్తు జయంతి వేడుకకు హాజరైన చిన్నారు లకు క్రిస్మస్ కేక్ కట్ చేసి పంచుకున్నారు... సర్వ మానవాళికి క్రీస్తు మార్గం అనుసరణీయం అన్నారు ఆయన లోకానికి ప్రేమను పంచడానికి వచ్చిన మహనీయుడు.... ఆయన త్యాగం మానవుడు మరిచిపోలే నిదన్నారు సర్వ మానవాళిని ప్రేమించ టానికి భూమిపై 33½ ఏళ్ల త్యాగం మరువలే నిది.... పాపుల కొరకు ఆయన మానవజన్మతో పుట్టిన పరిశుద్ధుడు... ఆయన మాటలు సత్యాన్ని జీవాన్ని మార్గాన్ని చూపుతున్నాయాన్నారు.. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుకలు ప్రేమ జీవించడం నేర్పుతున్నాయి.... వివిధ ప్రాంతాల నుండి వచ్చిన తెదేపా పార్టీ నాయకులు, స్థానిక క్రైస్తవ మత పెద్దలు, మహిళలు, చిన్నారులతో వేడుకలు ఘనంగా ముగిశాయి...