ఉప్పొంగిన హిందుత్వం...హైందవ శంఖారావ సన్నద్ధ సమావేశం.
December 22, 2024
స్థానిక శ్రీ బెంజ్ న్యూస్.సరస్వతీ శిశు విద్యా మందిరంలో నిర్వహించినటువంటి సమావేశంలో అమరావతి హైందవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దేవాలయాలను ప్రభుత్వ కబంధహస్తాల నుండి విడిపించుకునేందుకు విశ్వహిందూ పరిషత్ తలపెట్టినటువంటి హైందవ శంఖారావ సభను జయప్రదం చేయాలని ప్రతి ఒక్క హిందూ సోదరుడు ఇందుకోసం కృషి చేయాలని అందరూ ముక్తకంఠంతో నినదించారు. జనవరి 5న జరిగే సమావేశానికి అమరావతి మండల వ్యాప్తంగా వేలాదిగా తరలి వెళ్లాలని నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ వారి శక్తి కొలది పని విభజన చేసుకొని ప్రతి హిందూ సోదరుని చైతన్యపరిచి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పులిపాటి వెంకట పవన్ కుమార్, కోలా వెంకటేశ్వరరావు, కౌశిక ప్రసాద్, కోలా మల్లికార్జున రావు, వారణాసి వెంకటేశ్వర శర్మ, భువనగిరి సాయిబాబు, శంకరమంచి శ్రీనివాస్, బాలనాగు కృష్ణ ప్రసాద్, పారేపల్లి రాధాకృష్ణ, పసుపులేటి రామనాథ్, కోలా రమణ, Poly వెంకటేశ్వర్లు, మానూరు రమేష్, అప్పికట్ల శ్రీనివాసరావు, బెల్లపు సుబ్బారావు, రాయి సత్యనారాయణ, అలా వీరబాబు.. పలువురు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.