హ్యూమన్ రైట్స్ ,మీడియా నేషనల్ సభ్యుడిగా లక్ష్మణ్

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 


హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అండ్ మీడియా ఆర్గనైజేషన్ నేషనల్  లీగల్ సలహాదారుడిగా సత్తెనపల్లి పట్టణానికి చెందిన యువ న్యాయవాది కోటగిరి లక్ష్మణ్ ను నియమించినట్లు హ్యూమన్ రైట్స్ చైర్మెన్ ప్రదీప్ తెలిపారు.మానవ హక్కుల సంఘం సంస్థ చైర్మెన్ ప్రదీప్ మాట్లాడుతూ లక్ష్మణ్ కు గతంలో ఇదే పదవిని స్టేట్ లో ఇవ్వడం జరిగిందని,ఇప్పుడు తన పనితీరుకు నేషనల్ వైడ్ గా నియమించడం జరిగిందన్నారు.సమాజంలో మానవ హక్కుల పరంగా ఎవరికి ఏ సలహా  కావాలన్న నన్ను ఎప్పుడైనా సంప్రదించవచ్చని,సంస్థ పరంగా ఇప్పుడు ఇంకా నాపై మరింత బాధ్యత పెరిగిందని న్యాయవాది లక్ష్మణ్ మీడియాకు తెలిపారు.