హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

 


పిడుగురాళ్ల : బెంజ్ న్యూస్ 


పిడుగురాళ్ల పట్టణంలోని ఆంధ్రప్రదేశ్  ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్  బాలికల వసతి గృహమునందు హెల్ప్ ఫౌండేషన్ సత్తెనపల్లి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం లో భాగంగా  కోటేశ్వరమ్మ యోగ టీచర్ పర్యవేక్షణలో విద్యార్థినులకు యోగ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్  సి.హెచ్ వనజ కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ మహోన్నత వ్యక్తులు నమ్మిన తంత్రం యోగాతో మహా ఆరోగ్యమనే సిద్ధాంతం కావున చిన్నప్పటి నుంచే యోగా ను జీవితంలో ఒక భాగం చేసుకోవాలని అన్నారు. యోగ శిక్షణ నిర్వాహకురాలు కోటేశ్వరమ్మ మాట్లాడుతూ రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేస్తే మనసు తేలికవుతుందని అతిగా ఆలోచించే తత్వం దూరమవుతుందని, మెదడు పనితీరు చురుకుగా ఉంటుందని మానసిక శారీరక ప్రశాంతతతో పాటు ఆలోచన  విధానము మారుతుందని అన్నారు. హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులుకంచర్ల బుల్లి బాబు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే చదువుతోపాటు యోగాను  చేయడం వలన జీవన విధానంలో సానుకూల దృక్పథం ఏర్పడుతుందని, నీ మనసు నీ ఆధీనంలో ఉంటుందని ఒత్తిడిని జయించవచ్చునని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందము విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.