పెదకూరపాడు:బెంజ్ న్యూస్
మండలం నందు 7818 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నామని ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు.దీని నిమిత్తం మండలంలో ఉన్న 14 సచివాలయాలకు ఐదు కోట్ల 36 లక్షల 20 వేల 5వందల రూపాయలు ప్రభుత్వం వారు జమ చేశారన్నారు.ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జూలై ఒకటో తేదీన అన్ని గ్రామాల్లో ఉదయం 6 నుంచి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.పింఛన్దారుల ఇంటి వద్దకే పింఛన్ అందిస్తామనిఅధైర్యపడవద్దని తెలిపారు.