ప్రపంచ పర్యాటక కేంద్రాలైన అమరావతి,నాగార్జునకొండ,చంద్రగిరి
March 28, 2025
ప్రపంచ పర్యాటక కేంద్రాలైన అమరావతి,నాగార్జునకొండ,చంద్రగిరి మ్యూజియంలను మహా చైత్యం లను అభివృద్ధి చేయాలి అదనపు నిధులను మంజూరి
చేయవలసిందిగా భారత ప్రభుత్వ కేంద్ర పురావస్తు శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ (జె డీజీ ) డాక్టర్ లూర్దు స్వామి తో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ )జాతీయ ఉపాధ్యక్షులు మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు భేటీ
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, నాగార్జునకొండ మహా చైత్యము,మ్యూజియంలను అభివృద్ధి చేయాలి అని నిధులను మంజూరు చేయవలసిందిగా జాయింట్ డీజీ డాక్టర్ లూర్దు స్వామి కి విజ్ఞప్తి
దిల్లీ లోని తిలకుమార్గ్ లో గల కేంద్ర ప్రభుత్వ భారత పురావస్తు శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ జనరల్( జె డిజి) డాక్టర్ లూర్దు స్వామి తో సమావేశం అయ్యారు ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున కొండ అమరావతి, చంద్రగిరి మ్యూజియముల అభివృద్ధికి చర్యలు తీసుకోండి అదనపు నిధులు మంజూరీ చేయండి అంతర్జాతీయ పర్యాటకులు వస్తున్నారని ఏ ఒక్క మ్యూజియంలో కూడా గైడ్ సదుపాయం లేదని, డిస్ప్లే బోర్డ్సు, లైటింగ్ గ్యాలరీల అభివృద్ధి చేయాలని లూర్దు స్వామికి విజ్ఞప్తి చేశారు స్పందించిన జాయింట్ డైరెక్టర్ జనరల్ మాట్లాడుతూ అమరావతి, నాగార్జునకొండ చంద్రగిరి మ్యూజియంల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తప్పకుండా అమరావతి సర్కిల్ నుంచి నివేదికను తెప్పించుకొని తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు