ఘనంగా పెదమద్దూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా పెదమద్దూరులో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలి
డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఈరోజు పెద మద్దూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద మద్దూరు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు స్వర్గీయ నందమూరి తారకరామారావు ని స్మరించుకుంటూ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు స్మరించుకుంటూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేశారు పార్టీ జండా వందనం చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తొలుత స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోని అధికారాన్ని తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కిందన్నారు ప్రస్తుత టిడిపి జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలను ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత చంద్రబాబుకు దక్కింది అన్నారు కూటమి ప్రభుత్వ రాకతో రాజధాని అమరావతి మరో పది రోజుల్లో కొన్ని వేలమంది కార్మికులతో రాజధాని ప్రాంతం కళకళలాడబోతుందన్నారు పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు విశేష కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పొదిలి శ్రీనివాసరావు మాజీ ఉపసర్పంచ్ పొదిలి సాంబశివరావు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు పొదిలి మదన్మోహన్ (బుజ్జి), బూత్ కన్వీనర్ పొదిలి అనిల్ కుమార్ పంచాయతీ వార్డు మెంబర్ బుడ్డి హరిబాబు, జాస్తి సుధాకర్, బుడ్డి శ్రీనివాసరావు పార్టీ మాజీ అధ్యక్షులు జాస్తి అప్పయ్య , పొదిలి చిన్న నరసింహారావు, కిలారి కృష్ణ, ప్రత్తిపాటి రామాంజయ్య, వలివేటి సాంబశివరావు అమరయ్య,బాబి, కిషోర్, మోషయ్య, ప్రత్తిపాటి మల్లేశ్వరరావు, మేకల వెంకటేశ్వరరావు, కరాటి, అత్తోట జార్జి, అత్తోట మరియన్న తదితరులు పాల్గొన్నారు