పాఠశాలకు స్నేహ హస్తాలు ఫౌండేషన్ చేయూత మరియు ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ నెల్లూరి రమేష్ పాఠశాలకు బీరువా బహుకరణ

 


 బెంజ్ న్యూస్.పెదకూరపాడు ఎంపీపీ హెచ్.డబ్యూ. స్కూల్ కు స్నేహ హస్తాలు ఫౌండేషన్ వారు డిజిటల్ టీవీ మరియు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, ఆట వస్తువులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ నెల్లూరు రమేష్ మరియు పెదకూరపాడు గ్రామ సర్పంచ్ గుడిపూడి రాజు , మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు. డాక్టర్ నెల్లూరు రమేష్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. సర్పంచ్ గుడిపూడి రాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి స్నేహ హస్తాల వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా గొప్పవని అన్నారు. యం.ఇ.వో. సత్యనారాయణ గారు మాట్లాడుతూ స్నేహ హస్తాల వారు మన మండలంలోని పాఠశాలను ఎంపిక చేయడం చాలా మంచి విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నెల్లూరు రమేష్13వేల రూపాయల విలువ గల బీరువాని పాఠశాలకు బహుకరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు దర్శి నిర్మల డిజిటల్ టీవీ కోసం 6 వేల రూపాయలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిత న్యామతుల్లా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు