సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 సందర్బంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ గుంటూరు వారి ఆదేశాల మేరకు సత్తెనపల్లి న్యాయ సేవా కమిటీ చైర్మన్,సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు ఆద్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా డే ను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాలుగు కోర్టుల పరిధిలో ఉన్న న్యాయ మూర్తులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి తౌసిడ్ హుస్సేన్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి పి. ప్రియదర్శిని,సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ మరియు అడ్వకేట్ లు,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.