ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

 


సత్తెనపల్లి : బెంజ్ న్యూస్ 

సత్తెనపల్లి  ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు  స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్,  హెల్ప్ ఫౌండేషన్ సత్తెనపల్లి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు మరియు  ర్యాలీ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తెనపల్లి  డిప్యూటీ సూపర్నెంట్  ఆఫ్ పోలీస్ జి.గురునాథ్ బాబు  విచ్చేసి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని. మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరం అవుతున్నాయని మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారని గంజాయికి బానిసలుగా మారి యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని దానివల్ల తల్లిదండ్రులు మానసికక్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి గంజాయి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సత్తెనపల్లి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి మత్తుమాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితం మరణ శాసనం గా మారుతుందని మత్తుకు అలవాటు పడిన వారు శారీరకంగా మానసికంగా అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్   అరుణకుమారి మాట్లాడుతూ ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదం తర్వాత అంతటి సవాలుగా ఈ మాదకద్రవ్యాల వినియోగ సమస్య పరిణామం చెందిందని 40 శాతం యువత మత్తులోమునిగితేలుతున్నాని కావున యువత విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్  కోటీశ్వరమ్మ అధ్యక్షత వహించారు. అనంతరం  ర్యాలీ నీ సత్తెనపల్లి  డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్  గురునాథ్ బాబు జెండాఊపి ప్రారంభించిన అనంతరం విద్యార్థులు డ్రగ్స్ వద్దు జీవితం ముద్దు అంటూ  స్లొగన్స్ తో ర్యాలీ చేయడం జరిగింది . ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం సంధ్యారాణి , హెల్ప్ ఫౌండేషన్  వ్యవస్థాపక అధ్యక్షులు కంచర్ల బుల్లిబాబు, టీచర్ మస్తాన్, ఐటిఐ కాలేజీ ప్రిన్సిపల్ రమేష్ , ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయ బృందము పోలీసు శాఖ వారు   తదితరులు పాల్గొన్నారు.