అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీపీ

 


అమరావతి బెంజ్ న్యూస్

భారతీయ సనాతన  యోగా కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి  జూన్ 21 వ తేదీని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవం గా గుర్తించేలా కృషిచేసి ప్రపంచ గుర్తింపు కు కర్త, కర్మ, క్రియ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో "యోగా దివస్" కార్యక్రమంను విజయవంతం చేయాలని  పల్నాడు జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులైన మేకల హనుమంతరావు  తెలిపారు.అమరావతి లోని ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద 300 మందితో యోగ దినోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు, ముందుగా వచ్చిన 300 మందికి టీ షర్టులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ధ్యాన బుద్ధ ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించారు.అమరావతిలో జరిగే కార్యక్రమంనకు జిల్లా బిజెపి అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు  ముఖ్య అతిథిగా హాజరవుతారని, జిల్లా బిజెపి ఇన్చార్జి కొక్కెర శ్రీనివాస్ యాదవ్  కార్యక్రమంను పర్యవేక్షిస్తారని, మద్ది బాబు  కోఆర్డినేట్ చేస్తారని తెలిపారు.

కార్యక్రమంలో హనుమంతరావు  వెంట ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ ఆర్గనైజర్ మంజునాథ్  అమరావతి మండల బిజెపి అధ్యక్షులు మేకల వెంకటేశ్వర్ రావు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మద్ది ధాత్రి నారాయణ , నేరెళ్ల హనుమంతరావు  ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వాడపర్తి పుల్లారావు , మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు అనిల్  ప్రవీణ్  సునీల్ మునుగోడు మాజీ సర్పంచ్ మేకల శివశంకర్  జై కుమార్ పలువురు పాల్గొన్నారు...