గ్రామసభలో ప్రజా అభిప్రాయం మేరకు అభివృద్ధి పనులు ప్రారంభం

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మండల పరిధిలోని హౌస్ గణేష్ గ్రామంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ వేల్పుల వీరయ్య అధ్యక్షతన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.. గ్రామ సభను ఉద్దేశించి పంచాయతీ సెక్రటరీ వెంకట్రావు సభా వేదికలో పంచాయతీ కార్యాలయాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా అభిప్రాయం మేరకు గ్రామస్తులు తీర్మానం చేసిన అభివృద్ధి పనుల్లో భాగంగా గ్రామములో కార్యాలయానికి కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంక్, నేటి సమస్య తలెత్తకుండా బోర్ వెల్ అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు మండల పరిషత్ నిధుల్లోని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 15 ఫైనాన్స్ ద్వారా గ్రామాభివృద్ధికి వెచ్చించిన నాలుగు లక్షల లను పనులకు పురమాయిస్తున్నట్లు సమావేశంలో మాట్లాడారు.. కార్యక్రమాన్ని ఉద్దేశించి నీటి సంఘాల అధ్యక్షులు వేల్పుల అంకారావు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా గ్రామానికి ప్రభుత్వం అందించిన 15 ఫైనాన్స్ లో ని నాలుగు లక్షల లను గ్రామ అభివృద్ధికి తోడ్పడేలా ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు... గ్రామ సభకు గ్రామస్తులు పంచాయతీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు...