వంగవీటి మోహన రంగా త్యాగాలు మరవం ఆయన బాటను వీడవమం
December 25, 2024
జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మండల నేని చరణ్‌తేజ
చిలకలూరిపేట:కులం, మతం, రాజకీయాలకు అతీతంగా వంగవీటి మోహన రంగా ప్రజల గుండెల్లో నిలిచారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్‌తేజ అన్నారు. వంగవీటి మోహనరంగా 36 వర్ధంతి సందర్భంగా గురువారం చరణ్‌తేజ విశ్వనాధ్ సెంటర్లోని రంగా విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల పెన్నిధి అయిన రంగా మనకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు. వంగవీటి మోహనరంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి అని.. కోట్ల మంది ప్రజల అభిమానం ఆయనకే సొంతమని పేర్కొన్నారు. మాట ఇస్తే ప్రాణం పోయే వరకు పొరాడే వ్యక్తి వంగవీటి మోహనరంగా అని వెల్లడించారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించడమే ఆయనకు మనమిచ్చే ఘననివాళి అని రంగా ఆశయాల సాధన కోసం కృషి చేద్దామని చరణ్‌తేజ పిలుపు నిచ్చారు. రంగా త్యాగాలు మరువమని… ఆయన బాటను విడువమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖాదర్ భాష మొత్తం శెట్టి ప్రసాదు తోట వెంకట సురేషు, మన్యంపులి మోహన్, ఎస్ ఆర్ శ్రీనివాసరావు, వెంకయ్య, గంట్యాడ బద్రి, అన్నపరెడ్డి నాగరాజు, మీసాల లక్ష్మీనారాయణ, రామిశెట్టి తేజ, జాగృతి స్వామి, అజీజ్ మరియు 25వ వార్డులో జనసైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు