గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి

 


        బెంజ్ న్యూస్.ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అన్నం పల్లె గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సిరిగిరి రవి గుండెపోటుతో మంగళవారం

మృతి చెందారు. 


ఒంగోలులో విధి నిర్వహణలో ఉండగా సిరిగిరి రవి గుండెపోటుకు గురయ్యాడు. రవిని ఒంగోలులో స్థానిక ఓ ఆసుపత్రికి తరలించారు. 


కానీ అప్పటికే రవి మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. రవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం అన్నం పల్లె గ్రామానికి బుధవారం తరలించనున్నారు.


రవి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి ...