కడప: ఎంఈవో, టీచర్లపై కేసు నమోదు
July 22, 2024
బెంజ్ న్యూస్.కడప నగరంలోని డీఈవో కార్యాలయంపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 2 రోజుల క్రితం పాత ఆర్జేడిపై జరుగుతున్న విచారణకు ఆటంకం కలిగించేలా ఐదుగురు ఘర్షణకు దిగి దాడి చేసి తన సెల్ఫోన్ పగలగొట్టారని ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుండుపల్లి ఎంఈవో వెంకటేశ్ నాయక్, ఉపాధ్యాయులు ఆదినారాయణ రెడ్డి, నాగమణి రెడ్డి, శివకుమార్ రెడ్డి, రామకృష్ణలపై కేసు నమోదు చేశారు...