విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో భారీ కుంభకోణం: CM రేవంత్
తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి చేసుకున్న ఒప్పందాల్లో భారీ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ పద్దులపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఝార్ఖండ్‌లో ప్లాంట్ నిర్మాణ పనుల్ని బీహెచ్‌ఈఎల్ 18 శాతం తక్కువకు టెండర్ ద్వారా దక్కించుకుందని, అదే సంస్థకు అప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి టెండర్ లేకుండా.. నామినేషన్ ప్రాతిపదికన అప్పగించటం అక్రమం కాదా అని ప్రశ్నించారు.