సత్తెనపల్లి : బెంజ్ న్యూస్
సత్తెనపల్లి పట్టణంలో 22వ వార్డులో నివాసం ఉంటున్న చిన్ని కృష్ణకుమారి గత కొంతకాలం అనారోగ్యంతో బాధపడుతుంది ఇంటికి పెద్దదిక్కు లేకపోవడం ఇద్దరు ఆడపిల్లలతో జీవనం సాగిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ రావటం వల్ల ఆర్థికంగా బాగా ఇబ్బంది పడటం ఆర్థిక సాయం కావాలని వారి రిలేటివ్ ఆకుతోట దుర్గారావు కొత్త రామకృష్ణ కి చెప్పటం ద్వారా వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో పంపించారు అది చూసి సుమారు లక్ష పదివేల రూపాయలు ఆ కుటుంబానికి వచ్చాయి. ఈరోజు కొత్త రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆ నగదును ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ డొనేషన్ రావటానికి ముఖ్య పాత్ర వహించిన దివ్వెల శ్రీనివాసరావు, ఆకు తోట దుర్గారావు, కొత్త రామకృష్ణ సహకారంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆర్యవైశ్య యువజన సంఘం గౌరవ అధ్యక్షుడు కొత్త రామకృష్ణ మాట్లాడుతూ మేము అడగానే స్పందించి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ వాట్సాప్ మెసేజ్ చూసి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించిన చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమం లో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మద్ది వెంకటేశ్వర్లు, కొత్త రామకృష్ణ, ఆకుతోట దుర్గారావు, భవిరి శెట్టి హరి మొదలగువారు పాల్గొన్నారు.